Ravi Shastri: ఇద్ద‌రిలో ఎవ‌రు బెస్ట్ అంటే…

Ravi Shastri Honest Verdict On Rohit Sharma vs MS Dhoni Captaincy

Ravi Shastri: ఎంఎస్ ధోనీ, రోహిత్ శ‌ర్మ‌.. ఈ ఇద్ద‌రిలో ఎవ‌రు బెస్టో చెప్పేసారు క్రికెట్ లెజెండ్ ర‌విశాస్త్రి. రోహిత్ నేతృత్వాన్ని ఎంఎస్ ధోనీతో పోలుస్తూ త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. వైట్ బాల్ క్రికెట్‌లో ధోనీ రోహిత్ ఇద్ద‌రూ బెస్ట్ అని అన్నారు. భార‌త్‌లో T20I మ్యాచ్‌ల విష‌యంలో స‌క్సెస్‌ఫుల్ కెప్టెన్ ఎవ‌రైనా ఉన్నారంటే అది రోహిత్ మాత్ర‌మే అని తెలిపారు. 62 మ్యాచ్‌ల‌లో 49 రోహిత్ గెలిపించ‌గా… 72 మ్యాచ్‌ల్లో 41 మ్యాచ్‌ల‌ను ధోనీ గెలిపించాడ‌ని అన్నారు. కీ బౌల‌ర్లైన హార్దిక్ పాండ్య‌, జ‌స్ప్రీత్ బుమ్రాల‌ను ఎప్పుడు ఎక్క‌డ వాడాలో రోహిత్‌కు బాగా తెలుస‌ని కితాబిచ్చారు.