Ravi Shastri: పంత్‌ని చూసి కంట‌త‌డి పెట్టిన ర‌విశాస్త్రి

Ravi Shastri breaks down after seeing rishabh pant

Ravi Shastri: న్యూయార్క్‌లో జరిగిన ఇండియా వ‌ర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌లో రిష‌భ్ పంత్ ఉగ్ర రూపం దాల్చాడు. 18 నెల‌ల క్రితం కారు ప్ర‌మాదం నుంచి గాయాల‌తో బ‌య‌టప‌డిన పంత్.. పాక్‌పై త‌న ఆట‌తీరుతో మెప్పించాడు. 31 బంతుల్లో 42 ప‌రుగులు తీసిన పంత్.. పాకిస్థాన్‌పై ఇండియా గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. ఈ నేప‌థ్యంలో మాజీ కోచ్ ర‌వి శాస్త్రి పంత్‌పై ప్ర‌శంస‌లు గుప్పించారు. డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లి పంత్‌ని చూసి కంట‌త‌డి పెట్టుకున్నార‌ట‌. ఎంతో క‌ఠోర కృషితో మ‌ళ్లీ పంత్ ఫీల్డ్‌లోకి వ‌చ్చి అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చి ఎంద‌రికో స్ఫూర్తిగా నిలిచాడ‌ని ర‌వి శాస్త్రి తెలిపారు. ఈ నేప‌థ్యంలో పంత్‌కు బెస్ట్ ఫీల్డ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ప్ర‌క‌టించారు.