Rashid Latif: పాండ్య‌కు ద‌క్క‌ని కెప్టెన్సీ.. మండిప‌డుతున్న పాకిస్థానీ క్రికెట‌ర్

rashid latif slams ajit agarkar and gambhir for not selecting hardik pandya

Rashid Latif: T20I కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య‌ను నియ‌మించ‌క‌పోవ‌డంపై చివ‌రికి పాకిస్థాన్ క్రికెట‌ర్ కూడా ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. మాజీ పాకిస్థాన్ కెప్టెన్ ర‌షీద్ ల‌తీఫ్ ఎందుకు పాండ్య‌ను కెప్టెన్‌ని చేయ‌లేద‌ని అజిత్ అగార్క‌ర్, గౌత‌మ్ గంభీర్‌ల‌ను ప్ర‌శ్నించాడు. ఫిట్నెస్ అనేది కేవ‌లం ఒక సాకుగా చూపించి పాండ్య‌ను కెప్టెన్‌ని చేయ‌లేద‌ని.. నిజంగా ఫిట్నెస్ వ‌ల్లే పాండ్య‌ను ఎంపిక చేయ‌కపోయి ఉంటే పాండ్య‌కు ఫిట్‌నెస్ స‌ర్టిఫికేట్ ఇవ్వాల‌ని డిమాండ్ చేసాడు. ఫిట్నెస్ లేక‌పోయినా గొప్ప కెప్టెన్లుగా మారిన వారు చాలా మంది ఉన్నార‌ని.. ఒక‌వేళ సూర్య కుమార్ యాద‌వ్ లేక‌పోయుంటే రిష‌భ్ పంత్‌ను కెప్టెన్‌ని చేసి పాండ్య‌ను అప్పుడు కూడా ప‌క్క‌న పెట్టేవార‌ని మండిప‌డ్డాడు.