కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ నిష్క్రమణ.. జై షా షాకింగ్ వ్యాఖ్య
Rahul Dravid: టీమిండియా జట్టు కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ తప్పుకునే అవకాశాలు ఉన్నాయని BCCI సెక్రటరీ జై షా షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం జూన్‌తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త కోచ్ కోసం ప్రకటన వేయాలనుకుంటున్నట్లు జై షా వెల్లడించారు. 2021 నవంబర్ నుంచి రాహుల్ ద్రావిడ్ టీమిండియా హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. 2023 ODI వరల్డ్ కప్ తర్వాత ద్రవిడ్ కాంట్రాక్ట్‌ను పొడిగించారు. అయితే కోచ్‌గా కొనసాగాలని అనుకుంటే ద్రవిడ్ మళ్లీ అప్లై చేసుకోవాలి కానీ కాంట్రాక్ట్‌ను మళ్లీ పొడిగించడం ఉండదని జై షా తెలిపారు. అయితే ద్రవిడ్ స్థానంలో మళ్లీ భారతీయ కోచ్‌నే తీసుకుంటామని గ్యారెంటీ లేదని.. ఇండియన్ క్రికెట్ అసోసియేషన్ అనేది గ్లోబల్ బాడీ కాబట్టి విదేశీయుడిని కూడా కోచ్‌గా నియమించే అవకాశం ఉందని తెలిపారు.