ధోనీ ఎంట్రీ.. చెవులు ప‌గిలిపోయాయ్ అంటూ క్వింట‌న్ డికాక్ భార్య పోస్ట్

CSK vs LSG:  నిన్న చెన్నై సూప‌ర్ కింగ్స్..(Chennai Super Kings) ల‌ఖ్‌నౌ సూప‌ర్ జైంట్స్‌కి (Lucknow Super Giants) మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భ‌రితంగా సాగింది. ఈ మ్యాచ్ ల‌ఖ్‌నౌలోని ఏక‌నా స్టేడియంలో జ‌రిగిన‌ప్ప‌టికీ చాలా మంది ఎంఎస్ ధోనీ (MS Dhoni) కోస‌మే వ‌చ్చారు. ధోనీ గ్రౌండ్‌లోకి అడుగుపెట్టగానే అభిమానుల అరుపుల‌తో స్టేడియం ద‌ద్ద‌రిల్లిపోయింది.

అయితే మ్యాచ్ జరుగుతున్న స‌మ‌యంలో ల‌ఖ్‌నౌ సూప‌ర్ జైంట్స్ ఆట‌గాడు క్వింట‌న్ డికాక్ భార్య సాషా స్టేడియంలో ఉన్నారు. ఎప్పుడైతే ధోనీ ఫీల్డ్‌లో అడుగుపెట్టారో స్టేడియం ఒక్క‌సారిగా ద‌ద్ద‌రిల్ల‌డంపై ఆమె స్పందించారు. ధోనీ వ‌చ్చిన‌ప్పుడు ఈ రేంజ్‌లో అరిస్తే డిసెబ‌ల్స్ దాటిపోయి పాక్షికంగా వినికిడి శ‌క్తి కోల్పోయే ప్ర‌మాదం ఉంద‌ని ఆమె అన్నారు.

ALSO READ:

CSK కి బిగ్ షాక్.. రూల్ అవుట్ అయిన‌ స్టార్ ప్లేయ‌ర్

https://telugu.newsx.com/tag/ms-dhoni/