100 మ్యాచ్‌లు ఆడినా అనుభవం సున్నా
Punam Raut: మహిళల టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో నిన్న ఆస్ట్రేలియా చేతిలో మన అమ్మాయిలు ఓడిపోయారు. దీనిపై స్కిప్పర్ హర్మన్‌ప్రీత్ కౌర్ స్పందిస్తూ.. ఆస్ట్రేలియా టీంకి ఉన్న అనుభవం టీమిండియాకి లేదని.. ఇంకా నేర్చుకుంటున్నామని కుంటి సాకు చెప్పి తప్పించుకోవాలనే ప్రయత్నం చేసింది. దీనిపై మాజీ మహిళా క్రికెటర్ అయిన పూనమ్ రౌత్ మండిపడ్డారు. 100 క్రికెట్ మ్యాచ్‌లు ఆడుంటారు. అయినా అనుభవం సున్నానేనా? అంటూ ట్వీట్ చేసారు. అంటే ఇప్పటివరకు ఎన్నో మ్యాచ్‌లు ఆడిన అమ్మాయిలు ఓడిపోగానే అసలు అనుభవం లేదు నేర్చుకుంటున్నాం అని చెప్పడం విడ్డూరంగా ఉందని పూనమ్ రౌత్ అభిప్రాయపడ్డారు.ఇక న్యూజిల్యాండ్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌లో ఏ టీం గెలుస్తుందో దానిని బట్టి టీమిండియా సెమీ ఫైనల్స్‌కు వెళ్తుందో లేదో తెలుస్తుంది. పాకిస్థాన్ గెలిస్తే మన అమ్మాయిలు సెమీ ఫైనల్స్‌కి వెళ్తారు.