Piyush Chawla: పృథ్వీ షా కొడుకుతో కూడా ఆడ‌తా

piyush chawla says he will play with ishan kishan son as well

Piyush Chawla: తాను ఇప్పుడిప్పుడే రిటైర్మెంట్ గురించి ఆలోచించ‌డం లేద‌ని తెలిపారు పీయుష్ చావ్లా. త‌న కంటే ముందు ధోనీ రిటైర్మెంట్ ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. ఓసారి పృథ్వీ షా త‌న‌తో.. ఇంకా ఎందుకు భాయ్. ఆపేయ‌క అని అన్నాడ‌ని.. అప్పుడు త‌న‌తో ఒక మాట చెప్పాన‌ని పీయుష్ ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. తాను స‌చిన్ తెందుల్క‌ర్‌తో ఆడాన‌ని.. ఆ తర్వాత అర్జున్ తెందుల్క‌ర్‌తోనూ ఆడాన‌ని అన్నారు. అదే మాదిరిగా.. రేపు పృథ్వీ షా కొడుకుతో కూడా ఆడ‌తాన‌ని చెప్పిన‌ట్లు వెల్ల‌డించారు. 2007లో త‌న క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించిన చావ్లా అదే ఏడాది టీ20 వ‌రల్డ్ క‌ప్‌లో ఆడాడు. ఆ త‌ర్వాత 2011లో ధోనీ నేతృత్వంలో ODIలోనూ ఆడాడు.