Pat Cummins: వ‌ర్చువ‌ల్ రియాల్టీలో పోర్న్ చూస్తా

Pat Cummins says he watched porn through vr

Pat Cummins: వ‌ర్చువల్ రియాల్టీలో పోర్న్ చూస్తాన‌ని అంటున్నాడు ప్ర‌ముఖ ఆస్ట్రేలియ‌న్ క్రికెట‌ర్ ప్యాట్ క‌మిన్స్. ఆంగ్ల న్యూస్ ఛానెల్ అయిన ఫాక్స్ నెట్‌వ‌ర్క్ ఓ ఎంట‌ర్‌టైన్మెంట్ షోలో భాగంగా ప‌లువురు ఆస్ట్రేలియ‌న్ క్రికెట‌ర్లకు స‌ర‌దాగా లై డిటెక్ట‌ర్ టెస్ట్ చేసింది. ఈ షోటో ప్యాట్ క‌మిన్స్, ఉస్మాన్ ఖ‌వాజా, ట్రావిస్ హెడ్, మార్న‌స్ లంబుషాగ్నే, మిచెల్ మార్ష్, జాష్ హేజ‌ల్‌వుడ్ పాల్గొన్నారు. ఈ షోటో భాగంగా యాంక‌ర్ ఫ‌న్నీ ప్ర‌శ్న‌లు అడిగాడు. క‌రెక్ట్ ఆన్సర్ చెప్తే బ్లూ లైట్ వెల‌గ‌డం.. త‌ప్పుడు ఆన్స‌ర్లు చెప్తే రెడ్ లైట్ వెల‌గ‌డంతో ప్యాట్ కమిన్స్ చ‌చ్చిన‌ట్లు ఒక విష‌యాన్ని ఒప్పుకోవాల్సి వ‌చ్చింది.

ముందు యాంక‌ర్ ఉస్మాన్ ఖ‌వాజాను వ‌ర్చువల్ రియాల్టీలో ఎప్పుడైనా పోర్న్ చూసారా అని అడ‌గ్గా.. ఎందుకొచ్చిన గొడ‌వ‌లే అని లేదు అని స‌మాధానం ఇచ్చారు. దాంతో ఆ మెషీన్ అబద్ధం అంటూ రెడ్ లైట్ చూపించింది. ఆ త‌ర్వాత ఇదే ప్ర‌శ్న‌ను ప్యాట్ క‌మిన్స్‌ను అడ‌గ్గా… దొరికిపోతే బాగోద‌ని వ‌ర్చువ‌ల్ రియాల్టీలో పోర్న్ చూస్తాన‌ని ఇప్పటికీ చూస్తుంటానని చెప్పి అంద‌రినీ షాక్‌కు గురిచేసాడు. ఈ నేప‌థ్యంలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా షోలో ఉంటే ఎన్నో నిజాలు బ‌య‌టికి వ‌చ్చేవ‌ని ప్యాట్ క‌మిన్స్ స‌ర‌దాగా కామెంట్ చేసారు.