Pakistan: కోహ్లీ జీవితంలో మిగిలింది ఇదొక్కటే
Pakistan: 2025లో జరగబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా పాకిస్థాన్‌కు వచ్చి ఆడాల్సిందే అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పట్టుబట్టింది. ఇందుకు బీసీసీఐ మాత్రం ఒప్పుకోవడంలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే తప్ప ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్‌కి రావాలా వద్దా అని నిర్ణయించలేం అని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో పాకిస్థానీ క్రికెటర్ యూనిస్ ఖాన్ విరాట్ కోహ్లీ కోసమైనా టీమిండియా పాకిస్థాన్‌కు వచ్చి ఆడాలని రిక్వెస్ట్ చేస్తున్నాడు. విరాట్ క్రికెటర్‌గా జీవితంలో ఎంతో సాధించాడని ఇక అతని జీవితంలో ఏదన్నా మిగిలుందంటే అది పాకిస్థాన్‌కి వచ్చి క్రికెట్ ఆడటమే అని తెలిపాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఏం చేయాలో అవన్నీ సిద్ధం చేసిందని.. ఇక నిర్ణయం ఐసీసీదే అని తెలిపాడు.