Vinesh Phogat: ఫోగాట్‌కు నిరాశ.. ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయ్?
Vinesh Phogat: భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్‌కు CAS నుంచి నిరాశ ఎదురైన సంగతి తెలిసిందే. 100 గ్రాముల అధిక బరువు ఉన్నందున ఆమె ఫైనల్స్‌కు వెళ్లలేకపోయింది. దాంతో కనీసం సెమీ ఫైనల్స్‌లో గెలిచినందుకు రజతం ఇవ్వాలని అప్పీల్ చేసారు. దీనిని పరిశీలించి మూడు సార్లు తీర్పు వాయిదా వేసిన CAS.. నిన్న తీర్పు వెల్లడిస్తూ రజతం ఇవ్వలేం అని చెప్పేసింది. దాంతో ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేష్ (IOA) రజతం ఇప్పించడానికి ఇంకేమైనా మార్గాలు ఉన్నాయా అని పరిశీలిస్తోంది.
కేవలం 100 గ్రాములు అధిక బరువు ఉందని క్రీడాకారిణి పట్ల ఇంత కఠినత్వం ప్రదర్శించడం కరెక్ట్ కాదని అసోసియేషన్ అభిప్రాయపడుతోంది. ఐదేళ్ల పాటు ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేస్తుంటారని.. ఆ కష్టాన్ని కొన్ని గ్రాముల వెయిట్‌తో పోలుస్తూ తప్పుబట్టడం కరెక్ట్ కాదని అంటున్నారు. అంతేకాదు.. కొన్ని ఒలింపిక్స్ రూల్స్‌లో మార్పులు తీసుకురావాలన్న విషయంపై కూడా IOA గట్టిగా పోరాడనుంది.