Manoj Tiwary: వాంఖెడెలో హార్దిక్ ప‌ని అయిపోయిన‌ట్లే

Manoj Tiwary: గుజ‌రాత్ టైటాన్స్ (Gujarat Titans) కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా (Hardik Pandya) IPL మొద‌లుకావ‌డానికి ముందు ముంబై ఇండియ‌న్స్‌కు (Mumbai Indians) కెప్టెన్ అయ్యి అంద‌రినీ షాక్‌కు గురిచేసాడు. ముంబై ఇండియ‌న్స్ యాజ‌మాన్యం హార్దిక్‌ను సంప్ర‌దించి టీంలోకి రావాల‌ని కోరినప్పుడు.. త‌న‌కు కెప్టెన్సీ ఇస్తేనే వ‌స్తాన‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకే ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ‌ను (Rohit Sharma) త‌ప్పించి హార్దిక్ పాండ్య‌ను నియ‌మించారు.

దాంతో ఎప్పుడు హార్దిక్ మైదానంలోకి అడుగుపెట్టిన మ్యాచ్ వీక్షించేందుకు వచ్చే ముంబై ఇండియ‌న్స్, రోహిత్ శ‌ర్మ అభిమానులు చాలా దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారంటే హార్దిక్ తన జీవితంలో ఇలాంటి అవ‌మానాల‌ను ఎదుర్కొని ఉండ‌డు. దీనిపై మాజీ క్రికెట‌ర్ మ‌నోజ్ తివారీ స్పందిస్తూ.. వాంఖెడె స్టేడియంలో కానీ ముంబై ఇండియ‌న్స్ మ్యాచ్ జ‌రిగితే అప్పుడు హార్దిక్‌కు ఇంత‌కు మించిన అవ‌మాన‌క‌ర దృశ్యాలు ఎదుర‌వుతాయ‌ని అన్నారు.

“” ముంబై ఇండియ‌న్స్ అభిమానులు కానీ రోహిత్ శ‌ర్మ అభిమానులు కానీ కెప్టెన్సీని హార్దిక్‌కు ఇస్తార‌ని అస్స‌లు ఊహించి ఉండ‌రు. అలాంటిది హార్దిక్‌కు కెప్టెన్సీ ఇచ్చారు. ఇక వాంఖెడె స్టేడియంలో ముంబై ఇండియ‌న్స్‌ని ఆడియ‌న్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి. హార్దిక్ మ‌రింత దారుణంగా అవ‌మానప‌డ‌తాడు. ముంబై ఇండియ‌న్స్‌కు ఐదుసార్లు టైటిల్స్ గెలిపించిన రోహిత్‌ను త‌ప్పించి ఎందుకు హార్దిక్‌ను కెప్టెన్‌ను చేసారో నాకు ఇప్ప‌టికీ అర్థంకావ‌డంలేదు. కానీ హార్దిక్ అన్నీ స‌హిస్తున్నాడు. అవ‌మానాలు, తిట్లు, ట్రోల్స్ ఎదుర్కొంటున్న‌ప్ప‌టికీ హ‌ర్దిక్ మౌనంగా కూల్‌గా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు “” అని తెలిపారు.