KKR: ప్రతి సంవత్సరం రన్స్ తీస్తున్నా.. నన్ను తీసుకోరా?
KKR: IPL 2025 సంవత్సరానికి గానూ వేలం మొదలుకాబోతోంది. ఇందుకోసం మంచి వేదికను వెతుకుతున్నారు. అయితే ఎవర్ని ఉంచాలి ఎవర్ని రిలీజ్ చేయాలి అని ఆల్రెడీ టీమ్స్ అంతర్గతంగా డిస్కస్ చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కలకత్తా నైడ్ రైడర్స్ ఆటగాడు నితీష్ రాణా అసంతృప్తి వ్యక్తం చేసాడు. ప్రతి సంవత్సరం ఐపీఎల్లో రన్స్ తీస్తూనే ఉన్నానని.. కానీ ఇప్పటి వరకు తనకు యాజమాన్యం నుంచి కాల్ కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేసాడు. KKR తరఫున నితీష్ రాణా బాగానే పెర్ఫామ్ చేస్తున్నా కూడా ఈసారి అతన్ని రీటైన్ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.
శ్రేయస్ అయ్యర్‌కి గాయం కావడంతో నితీష్ రాణా IPL 2023లో కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. కానీ 2023లో నైట్ రైడర్స్ ప్రదర్శన అంత బాలేదు. ఈ ఏడాది రెండు మ్యాచ్‌లు ఆడాక రాణా గాయపడ్డాడు. అయినప్పటికీ ఈ ఏడాది ట్రోఫీ కలకత్తా నైట్ రైడర్స్నే వరించింది. KKRలో సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి, ఆండ్రూ రస్సెల్ కచ్చితంగా ఉండే అవకాశం ఉంది. నితీష్ రాణా, పేసర్ హర్షిత్ రాణాలకు అవకాశం లేనట్లే కనిపిస్తోంది. దాంతో నితీష్ రాణా ఇన్ని రన్స్ తీస్తున్నా తనను తీసుకోరా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.