6.3 శాతానికి పెరిగిన IPL విలువ.. పడిపోయిన MI బ్రాండ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) విలువ గతేడాదితో పోలిస్తే 6.3 శాతానికి పెరిగింది. 2023 వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ విలువ రూ.28 వేల కోట్లు ఉండగా.. ఈ ఏడాది రూ.135,000 కోట్లకు పెరిగింది. ఈ ఏడాది నుంచి 2028 వరకు ఐపీఎల్ ట్రోఫీ స్పాన్సర్‌షిప్ టాటా సంస్థ నుంచి రానుంది. టాటా నుంచి వచ్చే స్పాన్సర్‌షిప్ ధర రూ.2,500 కోట్లు. గతేడాదితో పోలిస్తే ఇది 50% ఎక్కువ.
అత్యధిక బ్రాండ్ వ్యాల్యూ ఉన్న టీమ్స్ ఇవే
టాప్ 1లో చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. ఈ టీం బ్రాండ్ విలువ 9% పెరిగింది
టాప్ 2లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంది.
టాప్ 3లో విన్నర్ కలకత్తా నైట్ రైడర్స్ ఉంది.
ఇక టాప్ 4 స్థానానికే ముంబై ఇండియన్స్ పరిమితమైంది. గతేడాదితో పోలిస్తే ముంబై ఇండియన్స్ బ్రాండ్ వ్యాల్యూని కోల్పోయింది.