టీం ఇండియా కోచ్.. ధోనీకి కీలక బాధ్యత అప్పగించిన BCCI
MS Dhoni: టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్ట్ ముగుస్తుండడంతో మరో కోచ్‌ని నియమించేందుకు BCCI ప్రయత్నిస్తోంది. అయితే ద్రావిడ్‌ని కొనసాగాల్సిందిగా BCCI కోరగా.. ఇందుకు ఆయన నిరాకరించారు. ఈ కోచ్ పదవికి రికీ పాంటింగ్, గౌతమ్ గంభీర్, స్టీఫెన్ ఫ్లెమింగ్, వీవీఎస్ లక్ష్మణ్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే చెన్నై సూపర్ కింగ్స్ కోచ్‌గా ఉన్న స్టీఫెన్ ఫ్లెమింగ్‌కే ఈ పదవి దక్కేలా ఉంది.
ఎందుకంటే బీసీసీఐ ఈ ఛాన్స్‌కు ఫ్లెమింగ్‌కి ఇస్తే బాగుంటుందని అనుకుంటోంది. కానీ ఇందుకు ఫ్లెమింగ్ సబబుగా లేరు. దాంతో బీసీసీఐ ధోనీకి ఓ బాధ్యత అప్పగించింది. ఎలాగైనా ఫ్లెమింగ్‌ను టీమిండియా కోచ్‌గా ఉండేందుకు ఒప్పుకునేలా రిక్వెస్ట్ చేయాలని కోరింది. ఫ్లెమింగ్ ఈ కోచ్ జాబ్ ఎందుకు ఒప్పుకోవడం లేదంటే.. ఏడాది మొత్తం ఫ్లెమింగ్ టీంతోనే ఉండాల్సి ఉంటుంది. దాంతో ఆయన స్వదేశానికి వెళ్లి ఫ్యామిలీతో ఎక్కువ సేపు గడిపే సమయం ఉండదు. అందుకే కోచ్ పదవికి నో చెప్పారు.