MS Dhoni: సొంత టీంతో వ‌స్తా.. ఆస‌క్తిక‌రంగా ధోనీ ప్ర‌క‌ట‌న‌

ms dhoni starting his own team

MS Dhoni: ఈసారి ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌కి నిరాశే ఎదురైంది. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు చేతిలో ఓడిపోయి ఇంటికి వెళ్లిపోయింది. అయితే.. సూప‌ర్ కింగ్స్ ఓడిపోయింద‌న్న బాధ కంటే త‌మ అభిమాన ఆట‌గాడు ఎం ఎస్ ధోనీ ఎక్క‌డ ఇంకో ఐపీఎల్ ఆడ‌కుండా రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తారో అని ఫ్యాన్స్ కంగారుప‌డుతున్నారు. ఇంకో టైటిల్ గెలిచాక రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తే బాగుంటుంద‌ని ఆశ‌ప‌డుతున్నారు.

ఈ నేప‌థ్యంలో ధోనీ చేసిన ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్ స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌ను క‌లిగిస్తోంది. ఇప్పుడు ఏం చేయాలో అది చేయాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. నా సొంత టీంని మొద‌లుపెడుతున్నాను అని ధోనీ ఫేస్‌బుక్‌లో కామెంట్ పెట్టారు. దాంతో ధోనీ త‌దుప‌రి ప్లాన్ ఏంటా అనే చ‌ర్చ మొద‌లైంది.