MS Dhoni: 2024లో ఉన్నామా లేక 2005లోనా?

MS Dhoni: నిన్న రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings), ఢిల్లీ క్యాపిటల్స్‌కి (Delhi Capitals) మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ గెలిచిన‌ప్ప‌టికీ చాలా మంది మ‌హేంద్ర సింగ్ ధోనీ బాదిన బౌండ‌రీలే గుర్తుంటాయి అన‌డంలో ఏమాత్రం సందేహం లేదు. దాదాపు మూడు మ్యాచ్‌ల‌లో ఆడ‌ని ధోనీ.. నిన్న రాత్రి మాత్రం మైదానంలో చెల‌రేగిపోయాడు. ఏమా బాదుడు.. ఏమా ఎనర్జీ.. చాలా మంది అభిమానులకు మ‌నం 2024లో ఉన్నామా లేక 2005లో ఉన్నామా అనే సందేహం త‌ప్ప‌కుండా క‌లిగే ఉంటుంది. 2005 ప్ర‌పంచ క‌ప్ స‌మ‌యంలో ధోనీ ఇదే రేంజ్‌లో బ్యాటింగ్ చేసాడు మ‌రి..!