MS Dhoni: ఆరోజే ఫేస్‌బుక్‌లో ప్ర‌క‌టించిన ధోనీ.. మ‌న‌కే అర్థంకాలేదు

MS Dhoni: మ‌హేంద్ర సింగ్ ధోనీ చెన్నై సూప‌ర్ కింగ్స్ (Chennai Super Kings) కెప్టెన్‌గా దిగిపోయిన సంగ‌తి తెలిసిందే. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL 2024) మ్యాచ్‌లు ఈరోజు నుంచి మొద‌ల‌వుతాయ‌న‌గా… ఆయన నిన్న తాను కెప్టెన్‌గా దిగిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ధోనీ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) ను నియ‌మించారు. అయితే తాను కెప్టెన్సీని వ‌దులుకుంటున్న‌ట్లు ధోనీ ఇప్పుడు కాదు మార్చి 3వ తేదీనే ఫేస్‌బుక్ ద్వారా ప్ర‌క‌టించేసారు. కానీ అప్పుడు మ‌నమే అర్థం చేసుకోలేక‌పోయాం.

మార్చి 3న ధోనీ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టారు. కొత్త సీజ‌న్.. కొత్త రోల్ కోసం నేను ఎంతో ఎదురుచూస్తున్నాను అని ధోనీ పోస్ట్ పెట్టారు. అప్పుడు చాలా మంది ఆయ‌న కొత్త లుక్‌లో క‌నిపించ‌బోతున్నారేమో అనుకున్నారు కానీ ఇలా కెప్టెన్సీని వ‌దిలేస్తార‌న‌ని క‌ల‌లో కూడా ఊహించ‌లేదు. గ‌తంలో ధోనీ రుతురాజ్‌కు ప‌లుమార్లు రెడీగా ఉండు. ఇది నీకు స‌ర్‌ప్రైజింగ్‌గా అనిపించ‌కూడ‌దు అన్నాడ‌ట‌. అప్పుడే త‌న‌కు అర్థ‌మైంద‌ని రుతురాజ్ వెల్ల‌డించాడు. ఈరోజు చెన్నై సూప‌ర్ కింగ్స్‌కి రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు మ‌ధ్య తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.