Mohammed Shami: దమ్ముంటే ఆ విషయం వారిని చెప్పమనండి
Mohammed Shami: తనకు సానియా మీర్జాకు పెళ్లైందని చాలా మంది మీమ్స్ చేస్తున్నారని కానీ ఈ విషయంలో తాను ఏమీ చేయలేనని అన్నారు క్రికెటర్ మహ్మద్ షమి. తనపై మీమ్స్ చేస్తున్నవారంతా అనధికారిక ఖాతాల నుంచి చేస్తున్నవే అని వారందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. దమ్ముంటే అధికారిక ఖాతాల నుంచి మీమ్స్ వేస్తే అప్పుడు తన నుంచి సమాధానం వస్తుందని.. మరి అలా వేసే దమ్ము ఎవరికైనా ఉందా అని ప్రశ్నించారు. మీమ్స్ సరదాగా ఎంజాయ్ చేయడానికి వేస్తుంటారని కానీ ఒకరి వ్యక్తిగత విషయం గురించి మీమ్ వేస్తున్నప్పుడు చాలా ఆలోచించాలని ఆ ఆలోచన ఇప్పటి జనరేషన్‌కు లేకపోవడం బాధాకరం అని అన్నారు.