Mohammad Kaif: RCB కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ‌ను తీసుకోండి

mohammad-kaif-wants-rohit-sharma-as-rcb-captain

Mohammad Kaif: 2025 ఐపీఎల్ నాటికి రోహిత్ శ‌ర్మ‌ను ముంబై ఇండియ‌న్స్ రిలీజ్ చేస్తే అత‌న్ని వెంట‌నే రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కొనుగోలు చేసి కెప్టెన్‌గా తీసుకోవాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు మాజీ క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ కైఫ్.  రోహిత్ శ‌ర్మ స్మార్ట్ క్రికెట‌ర్ అని.. ఇత‌ర ఆట‌గాళ్ల నుంచి బెస్ట్ గేమ్ బ‌య‌టికి ఎలా తీసుకురావాలో అత‌నికి బాగా తెలుస‌ని కొనియాడారు. ఎవ‌రికి ఎక్క‌డ ఫిట్ చేయాలో రోహిత్‌కి బాగా తెలుస‌ని అన్నారు.

2024 ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ రోహిత్ శ‌ర్మ‌ను కెప్టెన్‌గా తొల‌గించి హార్దిక్ పాండ్య‌కు అవ‌కాశం ఇచ్చింది. ఇదే పెద్ద షాకింగ్ విష‌యం అంటే.. ఐపీఎల్ నుంచి ఎగ్జిట్ అయిన తొలి టీం కూడా ముంబై ఇండియ‌న్సే కావ‌డం రెండో షాకింగ్ విష‌యం. దాంతో ఈసారి ముంబై ఇండియ‌న్స్ రోహిత్ శ‌ర్మ‌ను రిలీజ్ చేస్తుందా.. లేక రోహిత్ శ‌ర్మ‌నే త‌న‌కు జ‌రిగిన అవ‌మానాన్ని భ‌రించ‌లేక టీం నుంచి ఎగ్జిట్ అవుతారా అనే సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఒక‌వేళ ముంబై ఇండియ‌న్స్ రోహిత్‌ను రిలీజ్ చేస్తే అత‌న్ని ఎంచుకునే అవ‌కాశాన్ని రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు వెంట‌నే ద‌క్కించుకోవాల‌ని కైఫ్ స‌ల‌హా ఇచ్చారు.