Mohammad Kaif: ధోనీ కూడా ఆడలేకపోయాడు.. నవ్వూ అంతే కోహ్లీ..!
Mohammad Kaif: T20 ప్రపంచ కప్ గెలిచేందుకు భారత్ ఒక్క అడుగు దూరంలోనే ఉంది. ఈరోజు భారత్ దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఇద్దరిలో ఏ ఒక్కరు కప్ గెలిచినా అది వారికి తొలిసారే అవుతుంది. అయితే.. ఇప్పుడు కళ్లన్నీ విరాట్ కోహ్లీ పైనే ఉన్నాయి. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ విషయంలో తప్ప మిగతా మ్యాచ్‌లలో కోహ్లీ పేలవ ప్రదర్శనే ఇచ్చాడు. దీనిపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ స్పందించారు.
2011 ODI ప్రపంచ కప్ మ్యాచ్‌లలో కూడా మహేంద్ర సింగ్ ధోనీ పేలవ ప్రదర్శనతోనే ఉన్నాడని.. కానీ ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం చెలరేగిపోయాడని గుర్తుచేసాడు. అదే విధంగా కోహ్లీ కూడా ఈ చివరి మ్యాచ్‌లో బాగా ప్రదర్శన ఇస్తాడని భావిస్తున్నట్లు తెలిపారు. కోహ్లీకి ఎలాంటి బౌలింగ్‌నైనా ఎదుర్కొనే సామర్థ్యం ఉందని.. ఆ సామర్థ్యాన్ని చివరి మ్యాచ్‌లో ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.