Mohammad Hafeez: కాస్త కొవ్వు పెరిగితే ఏమ‌వుతుంది అని కోహ్లీ అన‌చ్చు

Mohammad Hafeez comments on virat kohli's fitness

 

Mohammad Hafeez: ప్ర‌పంచంలోని క్రికెట‌ర్ల‌లో ఫిట్టెస్ట్ క్రికెట‌ర్ ఎవ‌రైనా ఉన్నారంటే అది విరాట్ కోహ్లీనే అని అన్నారు మాజీ పాకిస్థాన్ కెప్టెన్ మహ్మ‌ద్ హ‌ఫీజ్. ప్ర‌స్తుతం కోహ్లీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌లు ఆడుతున్న సంగ‌తి తెలిసిందే. ఎంత ఒత్తిడి ఉన్నా కోహ్లీ మౌనంగా ఉంటున్నాడంటే అది అత‌ని ఫిట్‌నెస్ వ‌ల్లే అని.. ఆ ఫిట్‌నెస్ వ‌ల్లే అత‌ను ఇంత‌గా స‌క్సెస్ అయ్యాడ‌ని హ‌ఫీజ్ తెలిపాడు.

విరాట్ కోహ్లీకి ఉన్న ఫిట్‌నెస్ ఇత‌ర దేశాల‌కు చెందిన ప్లేయ‌ర్ల‌కు లేద‌ని.. పాకిస్థాన్ వాళ్లు కూడా కోహ్లీ ముందు ఫిట్‌నెస్ విష‌యంలో స‌రిపోర‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. ఈ నేప‌థ్యంలో ఆజాం ఖాన్ ఫిట్‌నెస్‌పై హఫీజ్ పరోక్షంగా కామెంట్స్ చేసారు. 15 ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నాను. కాస్త కొవ్వు పెరిగితే ఏమ‌వుతుంది? 70 సెంచ‌రీలు చేసాను క‌దా అని కోహ్లీ త‌న‌ని తాను స‌మ‌ర్ధించుకోవ‌చ్చ‌ని.. కానీ కోహ్లీ ఫిట్‌నెస్‌కి ఇచ్చే ప్రాధాన్య‌త ఎంతో గొప్ప‌ద‌ని తెలిపారు.