Matthew Hayden: ఆస్ట్రేలియా టీం కెప్టెన్‌గా ధోనీ

Matthew Hayden says ms dhoni can captain australia

Matthew Hayden: టీమిండియా క్రికెట‌ర్ ఎంఎస్ ధోనీకి ప్రపంచ‌వ్యాప్తంగా స్టార్‌డం ఉంద‌ని.. అత‌ను ఆస్ట్రేలియా టీంకు కూడా కెప్టెన్సీ చేసేంత సీన్ ఉంద‌ని అన్నారు మాజీ ఆస్ట్రేలియా క్రికెట‌ర్ మ్యాథ్యూ హేడెన్. ధోనీకి ఎలాంటి యాటిట్యూడ్ ఉండ‌ద‌ని.. టీమే ముఖ్యం అనేలా అత‌ని కెప్టెన్సీ ఉంటుంద‌ని తెలిపారు. ధోనీ కెప్టెన్సీలో టీమిండియా 2007, 2011, 2013లో ఐసీసీ ట్రోఫీ గెలిచింద‌ని 2013 తర్వాత నుంచి ఇండియాకు ఒక్క ట్రోఫీ కూడా లేద‌ని గుర్తుచేసారు. ఒక‌వేళ ధోనీ ఒప్పుకుంటే ఆస్ట్రేలియా టీం కెప్టెన్‌గా క‌చ్చితంగా నియ‌మిస్తార‌ని హేడెన్ అభిప్రాయ‌ప‌డ్డారు.