Manoj Tiwary: రోహిత్‌కే కెప్టెన్ బాధ్యతలు
Manoj Tiwary: ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కెప్టెన్సీ బాధ్యతలు మళ్లీ రోహిత్ శర్మకే (Rohit Sharma) దక్కనున్నాయని అన్నారు మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ. ముంబై ఇండియన్స్ టీంకు ప్రస్తుతం హార్దిక్ పాండ్య (Hardik Pandya) కెప్టెన్‌గా ఉన్నాడు. హార్దిక్ గతేడాది ఐపీఎల్ వరకు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ ఏడాది ముంబై ఇండియన్స్ టీంలోకి ఆహ్వానించగా.. కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తేనే వస్తానని చెప్పాడట. దాంతో ఐదు సార్లు టైటిల్ గెలిపించిన రోహిత్‌ను పక్కన పెట్టి హార్దిక్‌కు బాధ్యతలు అప్పగించారు.
పాపం హార్దిక్ ఏ ముహూర్తాన ముంబై ఇండియన్స్‌కి కెప్టెన్ అయ్యాడో కానీ.. ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేదు. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ మూడు మ్యాచ్‌లు ఆడింది. ఈ మూడింట్లో ఓటమి పాలైంది. దాంతో హార్దిక్ సామర్ధ్యంపై ప్రశ్నలు తలెత్తున్నాయి. రోహిత్ ఉంటేనే కనీసం టైటిల్ కాకపోయినా మ్యాచ్‌లైనా గెలుస్తామని ముంబై ఇండియన్స్ యాజమాన్యం భావిస్తోందట.
“” ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఎలాంటి మొహమాటం లేకుండా ఆటగాళ్లకు చెప్పేస్తుంటారు. ఎలాగైనా రోహిత్‌ను తీసేసారో ఇప్పుడు హార్దిక్‌ను కూడా తీసేసి మళ్లీ రోహిత్‌కే కెప్టెన్సీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. కెప్టెన్ బాగానే ఉన్నాడు కానీ అదృష్టం కలిసి రాలేదు అనడానికి లేదు. కెప్టెన్సీ బాలేదనే చెప్పాలి “” అని తెలిపారు తివారీ.