2025 Champions Trophy: ఆ టాప్ ప్లేయర్లను తీసేయనున్న రోహిత్
2025 Champions Trophy: 2025లో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో కెప్టెన్ రోహిత్ శర్మ కీలక మార్పులు చేయనున్నారు. శ్రీలంక సిరీస్‌లో టీమిండియా ఆట తీరు పట్ల రోహిత్ అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్, సంజు సాంసన్ సరిగ్గా ఆడలేకపోయారన్న బాధ రోహిత్‌కి ఉంది. దాంతో వారిద్దరినీ ఛాంపియన్స్ ట్రోఫీలో తీసుకోకూడదని రోహిత్ అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం రోహిత్ ఫోకస్ ఎక్కువగా రిషభ్ పంత్‌పై ఉంది. అందుకే అతనికి ఎక్కువ అవకాశాలు ఇస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో రిషభ్‌ను రెగ్యులర్ వికెట్ కీపర్‌ని చేయాలని రోహిత్ సన్నాహాలు చేస్తున్నాడు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం వహించనుంది. ఇండియా పాకిస్థాన్‌కి వెళ్లి ఆడే ప్రసక్తే లేదు. దాంతో మ్యాచ్‌లు UAEకి కానీ శ్రీలంకకు కానీ మార్చే అవకాశం ఉంది.