Surya Kumar Yadav: సూర్య‌.. ఇషాన్.. ఏంటి సంగ‌తి?

looks like there is a rift between Surya Kumar Yadav and ishan kishan

Surya Kumar Yadav:  చూడ‌బోతే T20 కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్‌కు ఇషాన్ కిష‌న్‌కు మ‌ధ్య గొడ‌వ జ‌రిగిన‌ట్లు ఉంది. సూర్య చేసిన ట్వీటే ఇలాంటి సందేహాల‌కు తావిచ్చింది. సూర్య గాయం కార‌ణంగా దులీప్ ట్రోఫీలో ఆడ‌లేక‌పోయాడు. ఇండియా ఏ వ‌ర్సెస్ ఇండియా డి మ్యాచ్‌లో త‌న ముంబై టీంమేట్స్ అయిన షామ్స్ ములానీ, త‌నుష్ కోటియ‌న్‌ల‌ను అభినందిస్తూ స్కై ట్వీట్ చేసాడు.

మ్యాచ్‌లో వీరిద్ద‌రి భాగ‌స్వామ్యం దృఢంగా ఉంద‌ని కొనియాడాడు. ముంబైకి అత్య‌వ‌స‌ర‌మైన ఆట‌గాళ్లు అని తెగ పొగిడేసాడు. మ‌రి ఇషాన్ మాటేంటి? ఇషాన్ కూడా ముంబై ఇండియ‌న్స్ త‌ర‌ఫున స్కైతో క‌లిసి ఆడిన‌వాడే. అలాంటిది ఇషాన్ గురించి ఎక్క‌డా ట్వీట్‌లో ప్ర‌స్తావించ‌క‌పోవ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య మాటలు లేవ‌ని విభేదాలు ఉన్నాయ‌ని ఫ్యాన్స్ తెగ ట్వీట్స్ చేస్తున్నారు. ఏడాది త‌ర్వాత ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిష‌న్ ఇండియా సి, ఇండియా డి మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో అద‌ర‌గొట్టేసాడు. 126 బంతుల్లో 111 ప‌రుగులు తీసాడు. మ‌రి స్కై ఇషాన్‌ను ప్ర‌శంసించ‌క‌పోవ‌డానికి కార‌ణం ఏంటి? అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.