CSK: రుతు కెప్టెన్సీ టీంకు నచ్చ‌లేదా?

CSK: చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను రుతురాజ్ గైక్వాడ్‌కు (Ruturaj Gaikwad) ఇచ్చేసి టీంని, ఫ్యాన్స్‌ని షాక్‌కు గురిచేసాడు మ‌హేందర్ సింగ్ ధోనీ (MS Dhoni). అయితే ఇప్పుడు ధోనీ తీసుకున్న నిర్ణ‌య‌మే కొంప ముంచేలా ఉంది. టీంలోని చాలా మందికి రుతు కెప్టెన్సీ న‌చ్చ‌డంలేద‌న్న‌ టాక్ న‌డుస్తోంది. దీనిపై చెన్నై సూప‌ర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ (Stephen Fleming) స్పందించారు.

“” రుతురాజ్ బ్యాటింగ్ విష‌యంలో నాకు ఏమాత్రం భ‌యంలేదు. ఇది పెద్ద టోర్నమెంట్ కాబ‌ట్టి ఒడిదొడుకులు ఉంటాయి. ప్ర‌తీసారి ర‌న్స్ చేయాల‌నే చూస్తాడు. ఇప్ప‌టివ‌ర‌కు రుతు కెప్టెన్సీ బాగానే ఉంది. ధోనీ, ర‌వీంద్ర జ‌డేజాలు క‌లిసి గైక్వాడ్‌కు అన్నీ ద‌గ్గ‌రుండి నేర్పిస్తున్నారు. టీంలో ఎవ్వ‌రికీ రుతు ప‌ట్ల ఎలాంటి ద్వేషం, కోపం లేవు “” అని తెలిపారు.