Krisnamachari Srikkanth: పాండ్య విష‌యంలో దాప‌రికాలు ఎందుకు? ధైర్యం లేదా?

Krisnamachari Srikkanth slams gambhir and agarkar

Krisnamachari Srikkanth: శ్రీలంక సిరీస్‌కి హార్దిక్ పాండ్య‌కు కెప్టెన్సీ బాధ్య‌త‌లు ఇవ్వ‌కుండా సూర్య‌కుమార్ యాద‌వ్‌కు ఇచ్చారు గౌత‌మ్ గంభీర్, అజిత్ అగార్క‌ర్. పాండ్యను ఎందుకు ఎంపిక‌చేయ‌లేదు అని మీడియా వ‌ర్గాలు ప్ర‌శ్నించ‌గా.. అత‌నికి ఫిట్‌నెస్ స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని అందుకే ఎంపిక‌చేయ‌లేద‌ని చెప్పారు. అయితే క్రికెట్ లెజెండ్ కృష్ణ‌మ‌చారి శ్రీకాంత్ మాత్రం వారి వ్యాఖ్య‌లతో ఏకీభ‌వించ‌డంలేదు.

“” ఐపీఎల్‌లో, టీ20 ప్ర‌పంచ క‌ప్‌లో ఆడిన పాండ్య‌కు ఫిట్‌నెస్ లేదంటే ఎవ‌డు న‌మ్ముతారు అని మండిప‌డ్డారు. అజిత్, గంభీర్‌ల‌కు ఉన్న‌ది ఉన్న‌ట్టుగా చెప్పే ధైర్యం లేదా? పాండ్య‌కు ఫిట్‌నెస్ లేదా? ఎవ‌డు న‌మ్ముతాడు? ఫిట్‌నెస్ లేకుండా ఐపీఎల్, ప్ర‌పంచ క‌ప్‌లో ఆడాడా? ఐపీఎల్‌లో పాండ్య ప్ర‌ద‌ర్శ‌న బాలేదు కాబ‌ట్టి సూర్య‌కుమార్ యాద‌వ్‌ను ఎంపిక‌చేసామ‌ని ధైర్యంగా చెప్పండి. ఆ ధైర్యం లేదా? అంతేకానీ ఫిట్‌నెస్ లేదు అని డొంక తిరుగుడు వ్యాఖ్య‌లు ఎందుకు “” అని మండిప‌డ్డారు.