IPL 2025: RCB కెప్టెన్‌గా కేఎల్ రాహుల్
IPL 2025: 2025లో జరగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చాలా కొత్త మార్పులు చూడబోతున్నాం. ఇప్పటికే ఐపీఎల్‌లో ఎన్నో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయన్న కథనాలు వినిపిస్తున్న నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంలో కూడా ఓ మార్పు జరగబోతోందనే టాక్ ఉంది. ఒకప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు అన్న మాటలు పడుతూ ఆ టార్చర్ తట్టుకోలేక కోహ్లీ కెప్టెన్సీని వదులుకోవాల్సి వచ్చింది. దాంతో ఫాఫ్ డు ప్లెస్సీని కెప్టెన్‌గా నియమించారు. అయితే 2025లో డు ప్లెస్సీ స్థానంలో కేఎల్ రాహుల్‌ని నియమించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ ఏడాది లఖ్‌నౌ సూపర్ జైంట్స్ టీంకి కెప్టెన్సీ వహించిన రాహుల్‌ను ఆ టీం యజమాని సంజీవ్ గోయెంకా మైదానంలోనే అందరి ముందు తిట్టడం వైరల్‌గా మారింది. దాంతో గౌరవం లేని చోట రాహుల్ ఆడాలని అనుకోవడం లేదు. మరోపక్క ఐపీఎల్ అనేది ఎవరి సొంత ప్రదేశాల కోసం వారు ఆడాలనుకుంటారని.. తాను పుట్టింది బెంగళూరులో కాబట్టి బెంగళూరు తరఫున ఆడాలని అనుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేసాడు. దాంతో బెంగళూరు టీం రాహుల్‌ని వేలంలో తీసుకోవాలనుకుంటోంది.