టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా లెజండ‌రీ క్రికెట‌ర్?

jonty rhodes to become fielding coach for team india

Jonty Rhodes: ఇప్ప‌టికే టీమిండియా కోచ్ ప‌ద‌వికి గౌత‌మ్ గంభీర్‌ను ఆల్మోస్ట్ ఎంపిక చేసేసారు. త్వ‌ర‌లో ఈ అంశంపై బీసీసీఐ నుంచి అధికారిక ప్ర‌కట‌న కూడా రాబోతోంది. అయితే.. ఇప్పుడు ఫీల్డింగ్ కోచ్‌ని కూడా బీసీసీఐ ఎంపిక చేయ‌నుంద‌ట‌. ఈ ప‌ద‌వికి లెజండ‌రీ క్రికెట‌ర్ జాంటీ రోడ్స్‌ను ఎంపిక‌చేయాల‌ని స‌న్నాహాలు చేస్తోంది. 2019లో ఇదే ప‌ద‌వికి రోడ్స్ అప్లై చేసుకోగా.. అప్ప‌టికే ఈ ప‌ద‌విలో ఉన్న ఆర్ శ్రీధ‌ర్‌ను కొన‌సాగించాల‌ని బీసీసీఐ నిర్ణ‌యించుకుంది. ప్ర‌స్తుతానికి ఫీల్డింగ్ కోచ్‌గా టి దిలీప్.. బౌలింగ్ కోచ్‌గా ప‌రాస్ మ‌హాంబ్రేలు ఉన్నారు.