Jasprit Bumrah: నాలుగో టెస్టుకు దూరం..!
Jasprit Bumrah: రాజ్‌కోట్ టెస్టులో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించిన రోహిత్ సేన ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. అన్ని విభాగాల్లో అదరగొట్టి స్టోక్స్ బృందాన్ని మట్టికరిపించింది. రాంచీలో జరిగే నాలుగు టెస్టుకు ఇదే ఉత్సాహంతో టీమిండియా సిద్ధమవుతోంది. అయితే.. ఈ టెస్టుకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్నాడు. అతడిపై ఒత్తిడిని తగ్గించేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
రాజ్‌కోట్ నుంచి భారత జట్టు మంగళవారం రాంచీకి వెళ్లనుంది. బుమ్రా మాత్రం సోమవారమే అహ్మదాబాద్ బయలేదేరనున్నాడు. అయితే.. అతడి స్థానంలో ఎవరు ఆడుతారు? అనేది మాత్రం BCCI ఇంకా చెప్పలేదు. మరో విషయం ఏంటంటే.. ఈ యార్కర్ కింగ్ ఆఖరి టెస్టుకు కూడా దూరమవుతాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. నాలుగో టెస్టు ఫలితాన్ని బట్టి బుమ్రా ఆఖరి టెస్టు ఆడడంపై కెప్టెన్, మేనేజ్మెంట్ ప్రకటన చేయనుందని సమాచారం.
ఉప్పల్ టెస్టులో దారుణంగా ఓడిన భారత్ వైజాగ్ టెస్టులో దుమ్మురేపింది. యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) డబుల్ సెంచరీతో కదం తొక్కగా.. బుమ్రా తన మ్యాజిక్ స్పెల్‌తో ఇంగ్లండ్ నడ్డి విరిచాడు. 9 వికెట్లు తీసి పర్యాటక జట్టు ఆనందాన్ని ఆవిరి చేశాడు. దాంతో ఈ స్పీడ్‌స్టర్‌కు విశ్రాంతినివ్వాలని కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రవిడ్ భావించారు. కానీ, మరో పేసర్ ముకేశ్ కుమార్ తేలిపోతుండడం, సిరీస్‌లో కీలకమైన టెస్టు కావడంతో బుమ్రాను రాజ్‌కోట్‌లో ఆడించారు. మ్యాచ్‌లో బుమ్రా కీలక సమయాల్లో వికెట్లు తీసి స్టోక్స్ సేనను దెబ్బకొట్టాడు. అనంతరం స్పిన్నర్ జడేజా 5 వికెట్ల ప్రదర్శనతో భారత్ 434 పరుగుల భారీ విజయం నమోదు చేసింది. నాలుగో టెస్టు ఫిబ్రవరి 23న రాంచీలో జరుగనుంది. రంజీ మ్యాచ్ కోసం జట్టును వీడిన ముకేశ్ ఆలోపు రోహిత్ బృందంతో కలువనున్నాడు.
ఇక ఐదో టెస్టుకు కూడా బుమ్రా అందుబాటులో ఉంటడా లేదన్నది నాల్గవ టెస్ట్ ఫలితంపై ఆధారపడి ఉంటుందని క్రిక్‌బజ్ తెలిపింది. కాగా ఈ సిరీస్‌లో బుమ్రా దుమ్మురేపుతున్నాడు. ఇప్పటివరకు 17 వికెట్లు పడగొట్టి ఈ సిరీస్‌లో లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. కాగా నాలుగో టెస్టుతో యువ పేసర్ ఆకాష్ దీప్ అంతర్జాతీయ అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. ఫిబ్రవరి 23 నుంచి రాంఛీ వేదికగా నాలుగో టెస్టు ప్రారంభం కానుంది.
ఇక, ఐపీఎల్ లో కొద్దిరోజుల క్రితమే ముంబై జట్టు.. రోహిత్ శర్మను (Rohit Sharma) కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ బాధ్యతలను హార్ధిక్ పాండ్యాకు అప్పజెప్పడాన్ని ముంబై సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ముంబై హార్ధిక్‌ను కెప్టెన్‌గా అనౌన్స్ చేయగానే ఆ జట్టులోని సీనియర్ ఆటగాళ్లు జస్ఫ్రిత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్‌లు ట్విటర్ (ఎక్స్) వేదికగా తమ అసహనంతో పాటు కోపాన్ని వెల్లడించారు. బుమ్రా అయితే ముంబై ఇండియన్స్ ట్విటర్ ఖాతాను అన్‌ఫాలో చేశాడు. తాజాగా అతడు ముంబై కెప్టెన్ హార్ధిక్ పాండ్యాను (Hardik Pandya) కూడా ట్విటర్లో అన్‌ఫాలో చేసినట్టు సమాచారం.
హార్ధిక్ ట్విటర్ ఖాతాను బుమ్రా అన్‌ఫాలో చేయడంతో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కెప్టెన్‌తో బుమ్రాకు విభేధాలున్నాయంటూ కొన్నాళ్లుగా వస్తున్న అనుమానాలకు ఆజ్యం పోసినట్టు అయిందని నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే ట్విట్టర్లో హార్ధిక్‌ను అన్‌ఫాలో చేసిన బుమ్రా.. ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం ఫాలో అవుతున్నాడు. రోహిత్ తర్వాత కెప్టెన్సీ రేసులో ముందువరుసలో ఉండే బుమ్రా.. హార్ధిక్ సారథ్యంలో ఆడేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదని గత కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి.