Rohit Sharma: రోహిత్‌ను బ‌ల‌వంతంగా రిటైర్ అవ్వ‌మ‌న్నారా?

is rohit sharma forced to quit t20 cricket

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్ర‌కటించిన సంగ‌తి తెలిసిందే. అయితే దాని వెన‌క కార‌ణాన్ని మాత్రం వెల్లడించ‌లేదు. క‌ప్ గెలిచాక రిటైర్ అవ్వ‌డానికి మంచిన అనుభూతి ఏముంటుంది అని రోహిత్ మీడియా ముందు చెప్పారు. అయితే.. రోహిత్‌ను బ‌ల‌వంతంగా రిటైర్ అవ్వ‌మ‌న్నార‌న్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే.. ఇప్పుడు టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ ప‌ద‌వీ కాలం ముగిసింది. ఇక గౌత‌మ్ గంభీర్ టీమిండియా కోచ్ కాబోతున్నారు. ఆల్రెడీ కొన్ని ఫార్మాట్ల నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ వంటి సీనియ‌ర్ క్రికెట‌ర్ల‌ను తీసేసి కొత్త వారికి అవ‌కాశం ఇస్తాన‌ని ఆల్రెడీ గంభీర్ బీసీసీఐతో మాట్లాడుకున్నాడు. ఈ విష‌యం తెలిసి గంభీర్ తొల‌గించ‌క‌ ముందే రోహిత్ రిటైర్మెంట్ ప్ర‌క‌టించార‌న్న టాక్ వినిపిస్తోంది.