రివర్స్ స్వింగ్ మీరు మాకు నేర్పిస్తారా? ఓడిపోయిన బాధలో పాక్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
Rohit Sharma: T20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ సమయంలో టీమిండియా గెలిచిందన్న అసూయతో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇన్జమామ్ ఉల్ హక్ క్రికెటర్ అర్ష్‌దీప్ సింగ్‌పై ఆరోపణలు చేసారు. బౌలింగ్ సమయంలో అర్ష్‌దీప్ బాల్ టాంపరింగ్ చేసాడని అందుకే ఆస్ట్రేలియాపై గెలిచాడని అన్నారు. దీనిపై ఆల్రెడీ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. పిచ్ ఎండిపోయినట్లుగా ఉన్నప్పుడు బాల్ రివర్స్ స్వింగ్ అవుతుందని.. కాస్త బుర్ర పెట్టి ఆలోచించాలని అన్నాడు.
దీనికి ఇన్జమామ్ స్పందిస్తూ.. రివర్స్ స్వింగ్ గురించి మీరు మాకు నేర్పిస్తారా? మా బుర్ర ఉపయోగించాం కాబట్టే బాల్ రివర్స్ స్వింగ్ అయ్యిందని పసిగట్టాం. రోహిత్ కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు. ప్రపంచానికి రివర్స్ స్వింగ్ నేర్పిందే మేము. అని పొగరుగా సమాధానం ఇచ్చాడు. అసలు ఈ ఆరోపణలపై రోహిత్‌కు స్పందించాల్సిన అవసరం కూడా లేదని అలాంటి వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని మాజీ క్రికెటర్ వీరంద్ర సెహ్వాగ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసారు.