Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా దూరం?
Champions Trophy 2025: 2025 ఫిబ్రవరిలో ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం వహించనుంది. కానీ టీమిండియా ఈ ట్రోఫీకి దూరంగా ఉండాలనుకుంటోంది. ఎందుకంటే.. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉన్న రాజకీయ టెన్షన్ల కారణంగా భారత జట్టు పాకిస్థాన్‌కి వెళ్లి ఆడే యోచనలో లేనే లేదు. భారత ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే తప్ప టీమిండియా పాకిస్థాన్‌లో అడుగుపెట్టదని బీసీసీఐ తేల్చి చెప్పేసింది. మరోపక్క పాకిస్థాన్ కంట్రోల్ బోర్డు టీమిండియా పాకిస్థాన్‌లోని లాహోర్‌కు వచ్చి ఆడి తీరాల్సిందే అని చెప్తోంది. దాంతో ఈ ట్రోఫీ ఆడకపోవడమే బెటర్ అని బీసీసీఐ యోచిస్తున్నట్లు టాక్స్ వస్తున్నాయి.
ఈ టోర్నమెంట్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు చివరి వైట్ బాల్ టోర్నమెంట్. ఒకవేళ ఈ టోర్నమెంట్ క్యాన్సిల్ అయితే ఇక వైట్ బాల్ టోర్నమెంట్లలో ఈ ఇద్దరు కీలక ఆటగాళ్లు కనిపించరు. 2008 తర్వాత నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా టీమిండియా పాకిస్థాన్‌కి వెళ్లి మ్యాచ్ ఆడింది లేదు. ICC మ్యాచ్‌లు, ఆసియా కప్‌లలో భాగంగా టీమిండియా పాకిస్థాన్‌తో తలపడుతూ వస్తోంది. ఈ ఛాంపియన్స్ టోర్నమెంట్‌ను శ్రీలంకకు కానీ UAEకి కానీ ఫిఫ్ట్ చేయాలని బీసీసీఐ డిమాండ్ చేస్తోంది. ఒకవేళ ICC వెన్యూ మార్చకపోతే మాత్రం ఈ టోర్నమెంట్‌కి భారత్ దూరమైనట్లే. భారత్ తప్పుకుంటే క్వాలిఫైయింగ్ మ్యాచ్ మిస్సయిన శ్రీలంక భారత్ బదులు ఆడుతుంది.