MI vs RR: హార్దిక్… జాగ్రత్త నాయనా..!
MI vs RR: ఇతర క్రికెటర్లు, IPL టీంల విషయంలో ఎవరు ఎలా ఆడుతున్నారు.. ఏ టీం టాప్‌లో ఉంటోంది వంటి అంశాలను మాత్రమే చూస్తున్నారు. కానీ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) విషయంలో మాత్రం అలా కాదు. గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) నుంచి ముంబై ఇండియన్స్‌కు వచ్చిన హార్దిక్ ఏకంగా టీంకు కెప్టెన్ అయిపోయాడు. దాంతో గతేడాది వరకు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మకు (Rohit Sharma), అతని ఫ్యాన్స్‌కు పెద్ద షాక్ తగిలింది.
దాంతో ఎప్పుడు ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరిగినా కూడా రోహిత్ శర్మ ఫ్యాన్స్ హార్దిక్‌ను ఒక ఆట ఆడేసుకుంటున్నారు. మైదానంలో గ్యాలరీలో కూర్చుని మరీ ట్రోల్స్ అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ట్రోల్స్ విషయంలో నిన్నటి వరకు ఒక లెక్క.. ఈరోజు నుంచి మరో లెక్క. ఎందుకంటే ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ సొంత మైదానం అయిన వాంఖెడె స్టేడియంలో ఆడింది లేదు. ఈరోజు ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ వాంఖెడెలో జరగనుంది.
ఇతర మైదానాల్లోనే హార్దిక్ ట్రోల్స్, కామెంట్స్ తట్టుకోలేకపోయాడు. ఇక సొంత మైదానంలో ఎలా తట్టుకుంటాడా అని క్రికెట్ అభిమానులే కాదు BCCI కూడా కాస్త టెన్షన్ పడుతోంది. ఈ విషయం గురించి ఆల్రెడీ మాజీ క్రికెటర్ అయిన మనోజ్ తివారీ స్పందించారు. ఇతర మైదానాలను మించిన ట్రోల్స్ వాంఖెడెలో ఎదుర్కోవాల్సి వస్తుందని.. హార్దిక్ ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలని అన్నాడు. మొన్న జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ ముందు రోహిత్ అభిమానులు రోహిత్ రోహిత్ అని అరుస్తుంటే ఆ ఎగతాళులు భరించలేక హార్దిక్ తన చేత్తో రెయిలింగ్‌పై బలంగా కొట్టి తన కోపాన్ని ప్రదర్శించడం వైరల్‌గా మారింది.
ALSO READ: Hardik Pandya: కెప్టెన్సీ వదిలేయనున్న హార్దిక్.. పగ్గాలు రోహిత్‌కేనా?