RR vs RCB: కాసేపట్లో మ్యాచ్.. విరాట్ కోహ్లీ భద్రతకు ముప్పు
RR vs RCB: ఈరోజు రాజస్థాన్ రాయల్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెటర్ విరాట్ కోహ్లీకి ప్రాణ హాని ఉందని సమాచారం రావడంతో స్టేడియంలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేసారు. సాధారణంగా ఉండాల్సిన భద్రతా బలగాలకంటే రెట్టింపు భద్రతను పెంచారు. ముప్పు కారణంగా నిన్న జరగాల్సిన ఆర్సీబీ ప్రాక్టీస్ మ్యాచ్ కూడా రద్దు చేసినట్టు సమాచారం. మొన్న అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఉగ్రవాదులని పోలీసులు అరెస్ట్ చేయగా కోహ్లీ భద్రతకు ముప్పు ఉన్నట్లు సమాచారం అందినట్లు తెలుస్తోంది.