IPL 2024 షెడ్యూల్ ఎలా ఉండబోతోంది?
IPL 2024: క్రికెట్ లవర్స్ కి గుడ్ న్యూస్.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (Indian Premiere League) షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 22న తొలి మ్యాచ్ జరుగనుంది. ప్రారంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Banglore) తలపడతాయి. ఈసారి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రెండు దశల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరుగనుంది.
లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections దృష్ట్యా తొలి 17 రోజులకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే BCCI రిలీజ్ చేసింది. మార్చి 22వ తేదీన CSK RCB తలపడటంతో సీజన్ స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 7వ తేదీన లక్నోతో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) తలపడుతుంది. తర్వాత జరిగే మ్యాచ్‌లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే తేదీలను బట్టి BCCI ఖరారు చేయనుంది.
ALSO READ: కాశ్మీర్‌లో గల్లీ క్రికెట్ ఆడిన మాస్టర్ బ్లాస్టర్
ఏప్రిల్- మే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల కోసం అధికారులు, పోలీసులు విధులు నిర్వహిస్తారు. IPL 2024 మ్యాచ్‌లు జరిగే స్టేడియాల్లో భద్రతా కోసం పోలీసుల అవసరం ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లను 10 నగరాల్లో నిర్వహిస్తారు. చెన్నై, మొహలి, కోల్ కతా, జైపూర్, అహ్మదాబాద్, బెంగళూర్, హైదరాబాద్, లక్నో, విశాఖపట్టణం, ముంబైలో మ్యాచ్‌లు జరుగుతాయి.
ఢిల్లీ వేదికగా జరిగే మ్యాచ్‌లను వైజాగ్‌లో నిర్వహించనున్నారు. తొలి దశలో వైజాగ్‌లో రెండు మ్యాచ్‌లు (మార్చి 31, ఏప్రిల్ 3) జరుగనున్నాయి. ఢిల్లీలో రైతుల ఆందోళన, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ మ్యాచ్‌లను వైజాగ్‌లో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైజాగ్‌లో 2012 మొదలు ఇప్పటివరకూ 13 ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి.
మ్యాచ్‌లు ఇలా..
మార్చి 22: చెన్నై సూపర్ కింగ్స్ X రాయల్ ఛాలెంజర్స్‌బెంగళూరు (చెన్నై)
మార్చి 23: పంజాబ్ కింగ్స్ (PBKS) X దిల్లీ క్యాపిటల్స్ (DC) (మొహాలీ)
మార్చి 23: కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) X సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) (కోల్‌కతా)
మార్చి 24: రాజస్థాన్ రాయల్స్ (RR) X లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (LSG) (జైపుర్)
మార్చి 24: గుజరాత్ టైటాన్స్ (GT) X ముంబయి ఇండియన్స్ (MI) (అహ్మదాబాద్)
మార్చి 25: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు X పంజాబ్ కింగ్స్ (బెంగళూరు)
మార్చి 26: చెన్నై సూపర్ కింగ్స్ X గుజరాత్ టైటాన్స్ (చెన్నై)
మార్చి 27: సన్‌రైజర్స్ హైదరాబాద్ X ముంబయి ఇండియన్స్ (హైదరాబాద్)
మార్చి 28: రాజస్థాన్ రాయల్స్ X దిల్లీ క్యాపిటల్స్ (జైపుర్)
మార్చి 29: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు X కోల్‌కతా నైట్‌రైడర్స్ (బెంగళూరు)
మార్చి 30: లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ X పంజాబ్ కింగ్స్ (లఖ్‌నవూ)
ALSO READ: Mohammed Shami: గుజరాత్ టైటాన్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ
మార్చి 31: గుజరాత్ టైటాన్స్ X సన్‌రైజర్స్ హైదరాబాద్ (అహ్మదాబాద్)
మార్చి 31: దిల్లీ క్యాపిటల్స్ X చెన్నై సూపర్ కింగ్స్ (వైజాగ్)
ఏప్రిల్ 01: ముంబయి ఇండియన్స్ X రాజస్థాన్ రాయల్స్ (ముంబయి)
ఏప్రిల్ 02: రాయల్ ఛాలెంజర్స్ X లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (బెంగళూరు)
ఏప్రిల్ 03: దిల్లీ క్యాపిటల్స్ X కోల్‌కతా నైట్ రైడర్స్ (వైజాగ్)
ఏప్రిల్ 04: గుజరాత్ టైటాన్స్ X పంజాబ్ కింగ్స్ (అహ్మదాబాద్)
ఏప్రిల్ 05: హైదరాబాద్ X చెన్నై సూపర్ కింగ్స్ (హైదరాబాద్)
ఏప్రిల్ 6: రాజస్థాన్ రాయల్స్ X రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (జైపుర్)
ఏప్రిల్ 7: ముంబయి ఇండియన్స్ X దిల్లీ క్యాపిటల్స్ (ముంబయి)
ఏప్రిల్ 7: లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ X గుజరాత్ టైటాన్స్ (లఖ్‌నవూ)