Hasan Mahmud: ఓడించి సెలబ్రేట్ చేసుకోవడం తప్పు
Hasan Mahmud: ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్‌లో బంగ్లా ఫాస్ట్ బౌలర్ హసన్ మహ్మూద్ నాలుగు కీలక ఇండియన్ వికెట్లు తీసాడు. వారిలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్ ఉన్నారు. అయితే సాధారణంగా క్రికెట్ మ్యాచ్‌లో బ్యాటర్ ఔట్ అయితే ఆ బౌలర్ ఆనందానికి అవధులుండవు. ఫీల్డ్‌పైనే ఎగురుతూ గంతులేస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు.
కానీ విరాట్, రోహిత్, గిల్ వికెట్లు తీసిన హసన్ మాత్రం ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకోలేదు. ఎందుకు అని హసన్‌ను అడగ్గా.. తనకు అలా సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం ఉండదని అంటున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ ఔట్ అయినవారు ఎంతో బాధలో ఉంటారని.. వారు ఫీల్డ్ వదిలి వెళ్తున్నప్పుడు సెలబ్రేట్ చేసుకుంటే వారి మనసు ఇంకా బాధపడుతుందని అది తనకు ఇష్టం లేదని తెలిపారు. ఒకవేళ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే తన టీం మెంబర్స్‌కి షేక్ హ్యాండ్ ఇవ్వడం, హైఫై ఇచ్చుకోవడం వంటివి చేస్తుంటానే తప్ప అరుస్తూ గ్రౌండ్ అంతా తిరగడం.. ఎగిరి గంతులేయడం వంటివి మాత్రం చేయనని అంటున్నాడు. హసన్ తన బౌలింగ్‌తో పిచ్చెక్కించినప్పటికీ రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు ఇండియాను గట్టెక్కించారు.