Hasan Ali: టీమిండియా ఆడ‌క‌పోతే క్రికెట్ ఆగిపోతుందా?

Hasan Ali says it does not matter if india does not play in icc championship trophy

Hasan Ali: 2025 ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీలో టీమిండియా ఆడ‌క‌పోతే క్రికెట్ ప్ర‌పంచం ఏమ‌న్నా ఆగిపోతుందా అని అన్నాడు పాకిస్థానీ క్రికెట‌ర్ హ‌స‌న్ అలీ. చివ‌రిసారిగా టీమిండియా, పాకిస్థాన్ క‌లిసి ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీని 2017లో ఆడారు. ఆ మ్యాచ్‌లో హ‌స‌న్ అలీ ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్న‌మెంట్‌గా నిలిచారు. అప్ప‌టి నుంచి రాజ‌కీయ ప‌రిణామాల దృష్ట్యా టీమిండియా పాకిస్థాన్‌లో జ‌రిగే మ్యాచ్‌ల‌కు వెళ్ల‌డంలేదు. పాకిస్థాన్‌, టీమిండియాతో జ‌ర‌గాల్సిన మ్యాచ్‌ల‌ను అబు దాబిలో కానీ శ్రీలంక‌లో కానీ ఏర్పాటుచేస్తున్నారు. అయితే ఈసారి అలా చేస్తే మాత్రం ఒప్పుకునేది లేద‌ని ఇప్ప‌టికే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తేల్చి చెప్పేసింది.

ఈ నేప‌థ్యంలో హ‌స‌న్ అలీ స్పందిస్తూ.. ఇండియన్ క్రికెట‌ర్ల‌కు పాకిస్థాన్‌లో ఆడాల‌ని ఉంది. “” ఈ విష‌యాన్ని వాళ్లే చాలా సార్లు చెప్పారు. కానీ టీమిండియా పాల‌సీలు, విధానాల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి. ఇండియాలో మ్యాచ్ ఉన్న‌ప్పుడు మేం వ‌చ్చాం. మరి మేం ఆతిథ్యం వ‌హిస్తున్న మ్యాచ్‌ల‌కు ఇండియా కూడా రావాలి క‌దా. ఒక‌వేళ రాక‌పోతే ఇండియాతో మ్యాచ్ ఆడం. అంతేకానీ టీమిండియా మాతో క్రికెట్ ఆడ‌క‌పోతే క్రికెట్ ప్ర‌పంచం ఏమీ ఆగిపోదు క‌దా “” అని మండిప‌డ్డారు.