Harmanpreet: టీమిండియాలో లేనిది.. ఆస్ట్రేలియాలో ఉన్న‌ది అదే

Harmanpreet says she and Deepti missed some key opportunities during their partnership

Harmanpreet: మ‌హిళల T20 ప్ర‌పంచ క‌ప్ మ్యాచ్‌లో నిన్న ఆస్ట్రేలియాలో టీమిండియా ఓడిపోయింది. మ‌హిళ‌ల టీం ఎప్పుడూ కూడా ఆస్ట్రేలియాతో ఒక్క మ్యాచ్ గెలిచింది లేదు. ఇలా జ‌ర‌గ‌డానికి కార‌ణం ఇదే అంటూ స్కిప్ప‌ర్ హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ కీలక వ్యాఖ్య‌లు చేసారు.

“” ఆస్ట్రేలియ‌న్ టీంలో ఉన్న‌ది మ‌న టీమిండియాలో లేనిది ఒక్క‌టే. ఐక‌మ‌త్యంగా ఆడ‌టం. ఆస్ట్రేలియాలో చాలా మంది ఆల్ రౌండ‌ర్లు ఉన్నారు. వారంతా క‌లిసి టీంను గెలిపించుకుంటారు. కానీ మ‌నం ఒక‌రు ఇద్ద‌రిపై మాత్రమే ఆధార‌ప‌డాలి. పైగా ఆస్ట్రేలియా టీంకి మాకంటే ఎక్కువ అనుభ‌వం ఉంది. అనుభ‌వం విష‌యానికొస్తే మ‌న చేతుల్లో ఏం లేదు. రాధ చాలా బాగా బౌలింగ్ చేసింది. కానీ నేను దీప్తి మాత్రం లూస్ బాల్స్ వ‌దిలేసాం. ఆస్ట్రేలియా నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. మాకు ఇంకో అవ‌కాశం ఇస్తే బాగుంటుంది. కానీ ఏ టీంకి గెల‌వాల‌ని రాసిపెట్టుంటే ఆ టీమే క‌దా గెలిచేది “” అని హ‌ర్మ‌న్ ప్రీత్ వ్యాఖ్యానించ‌డం వైర‌ల్‌గా మారింది.

నిన్న మ్యాచ్‌తో ఆస్ట్రేలియా సెమీ ఫైన‌ల్స్‌కి వెళ్లింది. ఇక ఇండియా సెమీ ఫైన‌ల్స్‌కి వెళ్తుందా లేదా అనేది న్యూజిల్యాండ్ వ‌ర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. ఇందుకోసం తొలిసారి ప్ర‌తి భార‌తీయుడు పాకిస్థాన్ గెల‌వాల‌ని కోరుకుంటాడు. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిస్తేనే ఇండియా సెమీ ఫైన‌ల్స్‌కి వెళ్లే అవ‌కాశం ఉంటుంది.