Haris Rauf: వీడు ఇండియన్ అయ్యుంటాడు.. పాక్ క్రికెటర్ దురుసు ప్రవర్తన
Haris Rauf: ప్రముఖ పాకిస్థానీ క్రికెటర్ హారిస్ రౌఫ్.. అమెరికాకు చెందిన ఓ క్రికెట్ అభిమానితో దురుసగా ప్రవర్తించాడు. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా అమెరికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన పాకిస్థాన్ టీం తర్వాతి వరల్డ్ కప్ కోసం క్వాలిఫైయర్స్ ఆడాల్సి ఉంది. టీ20 నుంచి పాకిస్థాన్ ఎలిమినేట్ అయ్యాక తొలిసారి రౌఫ్ తన భార్యతో కలిసి బయటికి వెళ్లాడు. ఆ సమయంలో ఓ అభిమాని సెల్ఫీ కావాలని అడగడంతో రౌఫ్ అతనితో గొడవపడ్డాడు. ఆ వ్యక్తి ఇండియన్ అనుకుని.. వీడు కచ్చితంగా ఇండియన్ అయివుంటాడు అనుకుంటూ అతన్ని బూతులు తిడుతూ కొట్టబోయాడు. పక్కనే ఉన్న రౌఫ్ భార్య అతన్ని కంట్రోల్ చేసేందుకు యత్నించింది.
దీనిపై రౌఫ్ మీడియా ద్వారా స్పందిస్తూ.. నా ఫ్యామిలీ జోలికి వస్తే తాడో పేడో తేల్చుకుంటా అని చెప్పాడు. అసలు ఆ అభిమాని ఏమన్నాడో మాత్రం రౌఫ్ చెప్పలేదు. పాకిస్థాన్ టీం ఎలిమినేట్ అయ్యాక దాదాపు అందరు ఆటగాళ్లు ఫ్లోరిడా నుంచి పాకిస్థాన్ వెళ్లిపోయారు. కానీ రౌఫ్‌తో పాటు మరికొందరు ఆటగాళ్లు మాత్రం ఇంకా ఫ్లోరిడాలోనే ఉన్నారు. వారు వేరే విమానంలో దుబాయ్ నుంచి పాకిస్థాన్ వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు.