Hardik Pandya: కెప్టెన్సీ వదిలేయనున్న హార్దిక్.. పగ్గాలు రోహిత్‌కేనా?
Hardik Pandya: హర్దిక్ పాండ్య పరిస్థితి చూసి ఇలాంటి పరిస్థితి మరే క్రికెటర్‌కు రాకూడదు అనే అనుకుంటారు. గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్య.. ఈ ఏడాది ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) టీంకు కెప్టెన్‌గా ఉన్నాడు. దాంతో రోహిత్ శర్మకు.. (Rohit Sharma) ఫ్యాన్స్‌కు ఇది తేరుకోని షాక్‌గా మారింది.
ఇప్పటివరకు IPL టీమ్స్‌లో ఏ జట్టుకు కెప్టెన్‌ను మార్చినా కూడా ఫ్యాన్స్ కొత్తగా ఎంపికచేయబడ్డ కెప్టెన్‌ను ఏమీ అనేవారు కాదు. కానీ మొదటిసారి ఐపీఎల్ కెరీర్లోనే హార్దిక్ పాండ్య ఎదుర్కొంటున్న ట్రోల్స్, కామెంట్స్ మరే క్రికెటర్ కూడా ఎదురుకోలేదు. ఇందుకు ఒక కారణం.. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ టీంకు 5 సార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలిపించడం.. రెండోది.. హార్దిక్‌ను ముంబై ఇండియన్స్‌కు తిరిగి రావాలని యాజమాన్యం కోరగా.. తనను కెప్టెన్‌ను చేస్తే వస్తానని అనడం. ఈ రెండు అంశాలు అభిమానుల్లో బలంగా నాటుకు పోయాయి. దాంతో లైవ్ టీవీలోనే హార్దిక్ పక్క విషం కక్కుతున్నారు.
ముంబై ఇండియన్స్ ఇతర మైదానాల్లో ఆడుతుంటేనే ఈ రేంజ్లో ట్రోలింగ్ ఉంటే.. ఇక సొంత మైదానం అయిన వాంఖెడె స్టేడియంలోకి అడుగుపెడితే ఎలా ఉంటుంది? మ్యాచే ఆగిపోతుందేమో అనే రేంజ్లో అభిమానులు రచ్చ చేసే అవకాశం లేకపోలేదు. ఈ విషయంపై ఇటీవల మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కూడా స్పందించారు. హార్దిక్ వాంఖెడె స్టేడియంలో అడుగుపెట్టాక ఆ ట్రోల్స్ తట్టుకోలేడని అన్నారు.
కెప్టెన్సీ వదిలేస్తాడా?
హార్దిక్ తనకు దగ్గరివారితో కెప్టెన్సీ వద్దురా బాబూ.. నేను ఈ ట్రోలింగ్స్ తట్టుకోలేకపోతున్నాను అని తన బాధను చెప్పుకున్నాడట. ఈ ట్రోల్స్, కామెంట్స్ వల్ల ఆటపై శ్రద్ధ పెట్టలేకపోతున్నానని.. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు అంత ఒత్తిడి లేదు కానీ ముంబై ఇండియన్స్ టీంకు కెప్టెన్ అయ్యాక విపరీతమైన ఒత్తిడి పెరిగిపోయి తనపై ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయని భయపడుతున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్సీ కంటే ఆటతీరు, టైటిల్ గెలవడం ముఖ్యం కాబట్టి కెప్టెన్సీని వదిలేస్తానని చెప్పాడట. దీనిపై యాజమాన్యంతో చర్చించాలని అనుకుంటున్నట్లు సమాచారం. సో.. త్వరలో ముంబై ఇండియన్స్ యాజమాన్యం మళ్లీ రోహిత్ శర్మనే కెప్టెన్‌గా అనౌన్స్ చేసే అవకాశం ఉంది.
ధోనీ సారథ్యంలో సచిన్ ఆడలేదా : రవిచంద్రన్ అశ్విన్
హార్దిక్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ ఆడటంపై స్పందించారు క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin). గతంలో ఎంఎస్ ధోనీ సారథ్యంలో సచిన్ తెందుల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ ఆడలేదా అని మండిపడ్డారు. కెప్టెన్ ఎవరైతే ఏంటి అందరూ భారతీయులే అందరూ టైటిల్ గెలవడానికే కదా ఆడేది అన్నారు.