Hardik Pandya: శ్రీలంక‌పై జ‌ర‌గ‌నున్న ODIల‌కు పాండ్య దూరం

Hardik Pandya to miss ODI Series vs Sri Lanka

 

Hardik Pandya: శ్రీలంక‌పై భార‌త్ ఆడాల్సిన ODIల‌కు హార్దిక్ పాండ్య దూరం కానున్నాడు. వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల‌ మొద‌టి మూడు మ్యాచ్‌లు ఆడ‌ను అని వెల్ల‌డించాడు. టీమిండియా స్వ్కాడ్‌ను ఇంకో రెండు రోజుల్లో ప్ర‌క‌టించ‌నున్నారు. T20I సిరీస్‌ని ఎవ‌ర్ని కెప్టెన్‌ని చేస్తారా అనే చ‌ర్చ ఆల్రెడీ మొద‌లైపోయింది. ఈ సిరీస్ నుంచి గౌత‌మ్ గంభీర్ ప్ర‌ధాన కోచ్‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. పాండ్య‌ను కెప్టెన్‌ను చేద్దామా అంటే ఫిట్‌నెస్ విష‌యంలో బీసీసీఐ వెన‌క్కి త‌గ్గుతోంది. దాంతో సూర్య‌కుమార్ యాద‌వ్‌ను కెప్టెన్‌ని చేస్తార‌నే టాక్ వినిపిస్తోంది. శ్రీలంక సిరీస్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ ఆడ‌టం లేదు. వీరి స్థానంలో యువ క్రికెట‌ర్ల‌ను ఎంపిక‌చేయాలని గంభీర్ అనుకుంటున్నారు.