Hardik pandya: నటాషా పోస్ట్‌పై సూపర్ అంటూ పాండ్య కామెంట్
Hardik Pandya: స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్య, నటాషా స్టాంకోవిక్‌లు విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నటాషా తన కుమారుడు అగస్త్యను తీసుకుని తన స్వస్థలం అయిన సెర్బియాకు వెళ్లిపోయింది. అయితే.. నటాషా పెట్టిన పోస్ట్‌పై పాండ్య కామెంట్ చేయడం ఇప్పుడు వైరల్‌గా మారింది.
నటాషా అగస్త్యతో కలిసి డైనోసార్ పార్క్‌కు వెళ్లింది. అక్కడ దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. హార్దిక్ లవ్, సూపర్ ఇమోజీలతో రిప్లై ఇచ్చాడు. దాంతో హార్దిక్ తన భార్యతో విడిపోయినప్పటికీ ఇగోలకు పోకుండా కుమారుడి కోసం ఫ్రెండ్లీగా ఉంటున్నాడు అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.