ఆరోజు విరాట్ వైపు చూడాలంటే వణుకు పుట్టింది
Virat Kohli: కింగ్ కోహ్లీ కోపం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మ్యాచ్ సమయంలో ఎంత అగ్రెసివ్‌గా ఉంటాడో ఆట తర్వాత అంతే ఆప్యాయంగా పలకరిస్తుంటాడు. అయితే విరాట్ కోపానికి ఓ కుర్ర ఆటగాడు వణికిపోయాడట. ఆ ఆటగాడు ఎవరో కాదు హర్యాణాకి చెందిన గుర్జప్నీత్ సింగ్. అంబాలాకి చెందిన ఈ 25 ఏళ్ల ఫాస్ట్ బౌలర్.. పంజాబ్ టీం తరఫున ఆడే అవకాశం రాకపోవడంతో తమిళనాడు టీం తరఫున ఆడుతున్నాడు. బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ సమయంలో గుర్జప్నీత్ సింగ్ నెట్ బౌలర్‌గా వ్యవహరించాడు. నెట్స్‌లో గుర్జప్నీత్ విరాట్ కోహ్లీనే అవుట్ చేసేసాడు. దాంతో విరాట్ కోపంతో ఒక్క లుక్ ఇచ్చాడట. ఆ తర్వాత తనకు విరాట్ వైపు చూడాలంటేనే వణుకు పుట్టిందని గుర్జప్నీత్ తెలిపాడు. ఆ తర్వాత కోహ్లీనే స్వయంగా అతన్ని పిలిచి బౌలింగ్ టిప్స్ చెప్పాడట. అప్పుడు కోహ్లీపై ఉన్న భయం పోయిందని తెలిపాడు.