Gautam Gambhir: ఆ స్టార్ క్రికెట‌ర్ త‌న‌కు అసిస్టెంట్‌గా కావాల‌ని అడిగిన గంభీర్

gautam gambhir wants abhishek nayar as his assistant coach

Gautam Gambhir: మొత్తానికి టీమిండియా కోచ్‌గా గౌత‌మ్ గంభీర్‌ను ప్ర‌క‌టించింది BCCI. అయితే.. త‌న‌కు ఒక అసిస్టెంట్ కోచ్ కావాల‌ని గంభీర్ అడిగాడ‌ట‌. అదికూడా ఎవ‌రో కాదు.. టీమిండియా స్టార్ క్రికెట‌ర్ అభిషేక్ నాయ‌ర్‌ను త‌న‌కు అసిస్టెంట్‌గా కావాల‌ని గంభీర్ కోరిన‌ట్లు తెలుస్తోంది. నాయ‌ర్ గంభీర్ కలిసి ఈ ఏడాది ఐపీఎల్ కోసం ప‌నిచేసారు. త‌న‌కు నాయ‌ర్ ఉంటే క‌లిసొస్తుంద‌ని.. టీమిండియాను స‌మ‌ర్ధవంతంగా న‌డిపించ‌గ‌లుగుతామ‌ని గంభీర్ అన్నార‌ట. గ‌తంలో నాయ‌ర్ ముంబై ఇండియ‌న్స్ త‌ర‌ఫున ఆడారు. ఆ త‌ర్వాత KKR ఎకాడెమీ డైరెక్ట‌ర్‌గా నియ‌మితుల‌య్యాడు.