Gautam Gambhir: టీమిండియాకు గంభీర్ వార్నింగ్
Gautam Gambhir: టీమిండియా ప్రధాన కోచ్‌గా నియమితుడైన గౌతమ్ గంభీర్ చార్జ్ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లకు వార్నింగ్ ఇచ్చాడు. ప్రతి క్రికెటర్ అన్ని ఫార్మాట్లను ఆడగలగాలని.. అంతేకానీ స్వలాభం కోసం ఇది ఆడను అది ఆడను అంటే మాత్రం తాను ఒప్పుకోనని తెలిపాడు. అథ్లెట్ల జీవితాల్లో గాయాలు సహజం అని.. ఫిట్‌గా ఉంటే మాత్రం అన్ని ఫార్మాట్లు (T20, ODI, టెస్ట్) ఆడాల్సిందేనని అన్నారు. జులై 26 నుంచి మొదలయ్యే శ్రీలంక సిరీస్‌కి గంభీర్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. రానున్న రోజుల్లో టీమిండియా 3 T20Iలు, 3 ODIలు ఆడనుంది.