విరాట్ రోహిత్‌కి గంభీర్ ఇచ్చిన లైఫ్ లైన్

gautam gambhir life line to virat kohli and rohit sharma

Rohit Sharma: T20 ప్ర‌పంచ క‌ప్ గెలిచాక అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు దిగ్గ‌జ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ. దాంతో టీమిండియా కోచ్ గౌత‌మ్ గంభీర్ వీరిద్ద‌రికీ ఓ లైఫ్ లైన్ ఇచ్చారు. 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ వ‌ర‌కు వారిద్ద‌రూ క్రికెట్ ఆడ‌చ్చ‌ని గంభీర్ అన్నారు. అయితే వారు ఆడగ‌ల‌రా లేదా అనేది ఫిట్‌నెస్‌ను బ‌ట్టి ఆధార‌ప‌డి ఉంటుంద‌ని.. ఫిట్‌నెస్ లేక‌పోతే ఏ మ్యాచ్‌లో కూడా వారికి అవకాశం ఉండ‌ద‌ని అన్నారు. ఆగ‌స్ట్ 1 నుంచి జ‌ర‌గ‌బోయే శ్రీలంక ఓడీఐ మ్యాచ్‌ల‌కు రోహిత్, కోహ్లీ సిద్ధం అవుతున్నారు. ఆ త‌ర్వాత ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీల్లో కూడా రోహిత్, కోహ్లీ ఆడ‌తారు.