Gautam Gambhir: గంభీర్ కోహ్లీ.. ఓ ఇంట్రెస్టింగ్ డిబేట్
Gautam Gambhir: విరాట్ కోహ్లీ.. గౌతమ్ గంభీర్ కలిస్తే మ్యుచువల్ ఫ్యాన్స్‌కి పండగే. అదీకాకుండా ఐపీఎల్ మ్యాచ్‌లో వీరిద్దరి మధ్య జరిగిన వివాదం తర్వాత కోహ్లీ, గౌతూ ఎప్పుడు కలిసినా అది హాట్ టాపికే అవుతోంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఎలాంటి విబేధాలు లేవు అని మరోసారి రుజువు చేసేందుకు BCCI వీరిద్దరి చేత స్పెషల్ ఇంటర్వ్యూ చేయించింది. ఈ ఇంటర్వ్యూలో విరాట్, గౌతూల మధ్య ఆసక్తికర సంభాషణ నడిచింది.
కోహ్లీ గంభీర్‌ను ఓ ప్రశ్న అడిగాడు. ఆట ఆడుతున్న సమయంలో మరో క్రికెటర్ వల్ల కానీ లేదా నీ వల్ల మరో క్రికెటర్‌కి కానీ సమస్య వస్తే దాని వల్ల నువ్వు ఆటపై పట్టు కోల్పోవడం.. ఆ టెన్షన్‌లో అవుట్ అయిపోవడం వంటివి అవుతుంటాయా? అని అడిగాడు. దీనికి గంభీర్ సమాధానం ఇస్తూ.. నాకంటే నీకే ఎక్కువ గొడవలు ఉన్నాయ్. కాబట్టి నువ్వే సమాధానం చెప్పాలి అనేసాడు. ఈ ఇంటర్వ్యూని BCCI త్వరలో రిలీజ్ చేయనుంది.