Suryakumar Yadav: సూర్య సెన్సేష‌న‌ల్ క్యాచ్.. మిల్ల‌ర్ నాటౌట్.. పొర‌పాటు జ‌రిగిందా?

did Suryakumar Yadav touched the boundary while catching the ball

Suryakumar Yadav: మొన్న జ‌రిగిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త్ సౌతాఫ్రికాకు మ‌ధ్య జ‌రిగిన ఉత్కంఠ‌పోరులో ఎట్ట‌కేల‌కు భార‌త్ క‌ప్ సాధించింది. డేవిడ్ మిల్ల‌ర్ బాదిన సిక్స్‌ను సూర్య కుమార్ యాద‌వ్ క్యాచ్ ప‌ట్ట‌డంతో టీమిండియాకు విజ‌యం వ‌రించింది. ఈ క్యాచ్ మామూలు క్యాచ్ కాదు. చ‌రిత్రలో నిలిచిపోతుంది. బౌండ‌రీ దాటేసిన సూర్య బాల్‌ను బౌండ‌రీ లోప‌ల విసిరేసి జంప్ చేసి మ‌రీ ప‌ట్టుకున్నాడు.

అయితే సూర్య క్యాచ్ పట్టే స‌మ‌యంలో అత‌ని కాలు బౌండ‌రీ రోప్‌ను త‌గిలింద‌ని.. ఆ క్యాచ్ చెల్ల‌ద‌ని.. మిల్ల‌ర్ అస‌లు అవుట్ కాలేద‌ని ఓ నెటిజన్ ట్విట‌ర్‌లో వీడియో షేర్ చేసాడు. ఆ వీడియోలో సూర్య కాలు బౌండ‌రీ తాడుకు త‌గిలిన‌ట్లు క్లియ‌ర్‌గా క‌నిపిస్తున్నా మిల్ల‌ర్‌కు అవుట్ ఇచ్చారని ఆ నెటిజ‌న్ ఆరోపించ‌డం సంచ‌లనంగా మారింది. టీమిండియా గెలిచిందని చాలా మంది ఓర్వ‌లేక‌పోతున్నార‌ని.. అందుకే ఇలాంటి వీడియోలు చేస్తున్నార‌ని మ‌నోళ్లు కామెంట్ సెక్ష‌న్‌లో రెచ్చిపోతున్నారు.