Vinesh Phogat: CAS తీర్పు ఆల‌స్యం.. ఫోగాట్ మంచికే

delay in cas result is a good sign for vinesh phogat

Vinesh Phogat: ఒలింపిక్స్‌లో భార‌త మ‌హిళా రెజ్ల‌ర్ వినేష్ ఫోగాట్‌కు చేదు అనుభ‌వం ఎదురైన సంగ‌తి తెలిసిందే. సెమీ ఫైన‌ల్స్ వ‌ర‌కు చేరుకున్న ఫోగాట్.. ఫైనల్స్‌లో పాల్గొని భార‌త్‌కు గోల్డ్ మెడ‌ల్ తెచ్చి మ‌రో చ‌రిత్ర సృష్టిస్తుంద‌ని అంతా అనుకున్నారు. కానీ నిరాశే మిగిలింది. ఫైన‌ల్స్‌కి ముందు వినేష్ ఉండాల్సిన బ‌రువు కంటే కేవ‌లం 100 గ్రాములు అధిక బ‌రువు ఉంద‌న్న కార‌ణంతో ఆమెను డిస్‌క్వాలిఫై చేసేసారు. దాంతో ఫైన‌ల్స్‌కి ముందు స‌రైన బ‌రువులోనే ఉండి సెమీ ఫైన‌ల్స్‌లో నెగ్గింది కాబ‌ట్టి క‌నీసం వెండి ప‌త‌కం అయినా ఇవ్వాల‌ని CASకు వినేష్ లేఖ రాసింది.

ఈ కేసుని వినేష్ త‌ర‌ఫున న‌లుగురు న్యాయ‌వాదులు వాదిస్తున్నారు. ఇద్ద‌రు ఫ్రెంచ్ లాయ‌ర్ల‌ను పారిస్ ఒలింపిక్స్ క‌మిటీ ఉచితంగా వాదించేందుకు నియ‌మించ‌గా.. భార‌త‌దేశంలోనే టాప్ లాయ‌ర్ల‌లో ఒక‌రైన హ‌రీష్ సాల్వే, విదుష్ప‌త్ సింఘానియాలను భార‌త‌దేశం త‌ర‌ఫున లాయ‌ర్లుగా నియ‌మించారు. ఈ కేసులో తీర్పు ఆగ‌స్ట్ 10నే రావాల్సి ఉండ‌గా.. దానిని 13కి వాయిదా వేసారు. పోనీ 13కి తీర్పు వ‌స్తుంద‌నుకోగా… మ‌ళ్లీ 16కి వాయిదా వేసారు. ఇలా ప‌లుమార్లు వినేష్ కేసు వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. అయితే వాయిదా ప‌డుతోంది అంటే శుభ ప‌రిణామ‌మే అని లాయ‌ర్లు అంటున్నారు.

ఎందుకంటే CAS ఇలాంటి కేసుల‌ను ఇంత ఆల‌స్యం చేయ‌దు. రెండు మూడు రోజుల్లోనే తీర్పు వెల్ల‌డించేస్తుంది. అలాంటిది ఫోగాట్ కేసును ఇంత‌గా వాయిదా వేస్తోందంటే.. మెడ‌ల్ ఇవ్వాల‌న్న ఉద్దేశంతోనే ఉంద‌ని అంటున్నారు. అదీకాకుండా.. గ‌తంలో CAS ద‌గ్గ‌రికి ఇలాంటి కేసే వ‌చ్చింది. సోమ‌వారం ఒలింపిక్స్‌లో జిమ్నాస్టిక్స్ ఫైన‌ల్స్‌లో జోర్డాన్ చైల్స్ అనే అథ్లెట్ ఐదో స్థానంలో నిలిచింది. ఆమె కంటే ముందు ఇద్ద‌రు అథ్లెట్లు ఉన్నారు.

అయితే చైల్స్‌కి కాస్త క‌ష్ట‌మైన‌ప్ప‌టికీ ఆమె ఫైన‌ల్స్‌లో ఐదో స్థానానికి వ‌చ్చింద‌ని.. ఆమె క‌ష్టాన్ని గుర్తించి మూడో స్థానం క‌ల్పించి ర‌జత ప‌త‌కం ఇవ్వాల‌ని చైల్స్ కోచ్ సెసీల్ లెండి అప్పీల్ చేసింది. దాంతో చైల్స్‌కి మూడో స్థానం క‌ల్పించి మ‌రీ ర‌జ‌త ప‌త‌కం ఇచ్చారు. ఈ విష‌యాం CAS వ‌ద్ద‌కు వెళ్లడంతో వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. మూడో స్థానం లేదు ఏం లేదు మ‌ర్యాదగా ఆ ర‌జతం వెన‌క్కి ఇచ్చేయండి అని కర్క‌శంగా తీర్పు వెల్ల‌డించింది. అంత‌టి క‌ఠిన‌మైన CAS ఫోగాట్ విష‌యంలో ఇంత జాప్యం చేస్తోందంటే క‌చ్చితంగా గుడ్ న్యూస్ ఇస్తుంద‌ని అంతా ఆశిస్తున్నారు.